2 July, 2026 | 5:33 AM

యాదాద్రి కొండపై శరత్ పౌర్ణమి వేడుకలు..

18-10-2024 11:19 AM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): శరత్ ఋతువు.. ఆకాశంలో చల్లని నిండు చంద్రుడి వెలుగుల్లో గురువారం రాత్రి ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరి కొండపై శరత్ పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య దేవాలయములో శరత్ పౌర్ణిమ పురస్కరించుకొని ఆలయంలో శ్రీ స్వామి వారికి ప్రత్యేక సేవ జరిపారు. తిరివీధి మండపంలో ఉత్సవ మూర్తులు వేంచేసి వేద విన్నపాన్ని, దివ్య ప్రబంధ పారాయణం జరిపి, విశేష ప్రసాద వితరణ గావించారు.