14-11-2025 10:06:40 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణం బాలల దినోత్సవం పురస్కరించుకొని శాంతినగర్ పోకల భవాని దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సరయు హాస్పిటల్ సహకారంతో డాక్టర్ టి రవళి డాక్టర్ టి సాయికుమార్ పర్యవేక్షణలో శాంతినగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మహిళలకు పిల్లలకు వైద్య పరీక్షలు చేసి తగు మందుల పంపిణీ జరిగినది. బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలలకు మంచి వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఇటీ సదుద్దేశంతో ఇట్టి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది.
అలాగే మహిళలందరికీ వైద్య పరీక్షలు చేసి తగు మందులు అందించడం జరిగినది కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ పి రవళి డాక్టర్ పి సాయికుమార్.కృతజ్ఞతలు అలాగే ఇట్టి కార్యక్రమంలో పాలుపంచుకున్న శాంతినగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు.అడప సంతోష్ వడ్నాల శేఖర్ బాబు వెలిశాల అభినయ్ కొంపెల్లి విజయ్ రామారావు సోమిశెట్టి పూజిత చోడబోయిన కౌసల్య కమటం మంజుల చెవిటి మల్లీశ్వరి సువర్ణ సౌజన్య రూప మహిళా బృంద సభ్యులు పాల్గొన్నారు.