calender_icon.png 9 June, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సర్దార్2’ ముగించారు

09-06-2025 02:25:50 AM

హీరో కార్తి నటించిన ‘సర్దార్’ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో హిట్ టాక్ అందుకోగా, దానికి సీక్వెల్‌గా ‘సర్దార్2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కు దర్శకత్వం వహించిన పీఎస్ మిత్రన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టీమ్ సెట్‌లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా షూటింగ్ పూర్తయిన విషయాన్ని ప్రకటించారు.

ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తుండగా, ఎస్‌జే సూర్య పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా; డీవోపీ: జార్జ్ సీ విలియమ్స్; స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్; ఎడిటర్: విజయ్ వేలుకుట్టి.