17 April, 2026 | 2:47 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

చారిత్రక నేపథ్యంలో బాలకృష్ణ 111వ చిత్రం

09-06-2025 02:24 AM

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మంగళవారం (జూన్ 10వ తేదీ) బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న ‘అఖండ2’ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల కానుంది. అంతేకాక ఆయన బర్త్‌డే గిఫ్ట్‌గా రెండు రోజుల ముందే బాలకృష్ణ కథానాయకుడిగా నటించనున్న 111వ చిత్రాన్ని టీమ్ ప్రకటించేసింది.

ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నారు. ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. ప్రస్తుతం ‘పెద్ది’ వంటి  పాన్‌ఇండియా సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న వేంకట సతీశ్ కిలారు ‘ఎన్‌బీకే111’ను వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సగం లోహ కవచంతో మిగతా సగం వైల్డ్‌గా కనిపిస్తున్న ఉగ్ర సింహం ఫెరోషియస్ ఇమేజ్ సినీప్రియులను ఆకట్టుకుంటోంది.

ఈ పోస్టర్‌ను ఇలా రూపొందించడం ద్వారా మేకర్స్ సినిమాలో బాలకృష్ణ పోషించనున్న పాత్ర ఎంత శక్తిమంతంగా ఉంటుందో చెప్పారు. ఇప్పటివరకు మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్లతో ఆకట్టుకున్న గోపిచంద్ మలినేని తొలిసారిగా ఈ సినిమాను చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తుండటం, ఇంతకుముందెన్నడూ చూడని అవతారంలో బాలకృష్ణను చూపిస్తానని చెప్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. ఈ స్క్రిప్ట్‌కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.