15 April, 2026 | 5:48 AM

హనుమకొండలో రేపు సర్దార్ 150 ఐక్యత పాదయాత్ర

17-11-2025 03:59 PM

హనుమకొండ,(విజయకాంతి): కేంద్ర ప్రభుత్వం, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ వరంగల్ ద్వారా మరియు ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వంటి సంస్థల అనుసంధానంతో హనుమకొండ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో సర్దార్ 150 ఐక్యత పాదయాత్ర మంగళవారం ఉదయం 9గంటలకు హనుమకొండ లోని కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ (హనుమకొండ బస్టాండ్ ఎదురుగా) వద్ద ప్రారంభ కార్యక్రమం  నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన వ్యవహారాలు మరియు క్రీడలశాఖ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు.

జిల్లా కలెక్టర్  స్నేహ శబరిష్ సంబంధిత పోస్టర్ను, జాయింట్ కలెక్టర్ వెంకటరెడ్డి తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ప్రారంభించుటకు జిల్లాలోని ప్రముఖులు మరియు ప్రభుత్వ అధికారులు విచ్చేయనున్నారని, ఈ కార్యక్రమం కాకతీయ డిగ్రీ కళాశాల నుండి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వైపుగా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. యువతలో దేశభక్తిని, మాదకద్రవ్యాల నుండి విముక్తి కొరకు, మరియు ప్రజల్లో ఐక్యతను పెంపొందించేందుకు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమకొండ జిల్లా యువత, విద్యార్థులు, వాలంటీర్లు మరియు యావత్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.