calender_icon.png 17 November, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాలయంలో ఘనంగా శివుడికి అభిషేకాలు

17-11-2025 03:54:37 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని పాత బజార్లో గల శివాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం ను  పురస్కరించుకొని పూజారి వల్లకొండ మఠం మహేష్  శివునికి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

అలాగే సుల్తానాబాద్ పట్టణంలోని గుడి మిట్టపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో పూజారి పోలాస అశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.. గుడి మిట్టపల్లి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసంను పురస్కరించుకొని మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు  అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని దేవాలయం ఆవరణలో నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పూజారి అశోక్ కోరారు.