దేశ సమైక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్
- మెదక్ ఎంపీ రఘునందన్రావు
సంగారెడ్డిలో ఐక్యతా మార్చ్
సంగారెడ్డి, నవంబర్ 12(విజయక్రాంతి): దేశ సమైక్యతకు ప్రతీకగా ఉక్కు మనిషి స ర్దార్ వల్లభాయ్ పటేల్ నిలుస్తారని మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలిపారు. సర్దార్ వ ల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా బుధవారం సంగారెడ్డిలో ఐక్యత మా ర్చ్ ఘనంగా జరిగింది. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భార త్ సంస్థ సమన్వయంతో ఐబి నుండి కలెక్టరేట్ వరకు ఈ పాదయాత్ర నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రా వు, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంజయ్య, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘వందే మాతరం ‘జైహింద్’ నినాదాలతో పట్టణం మార్మోగింది. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమాన్ని ఎంపీ రఘునందన్ రావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తో పాటు దేశానికి స్వాతంత్రం సిద్ధించిన 100వ సంవత్సరం 2047 వరకు భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అ న్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు ప్రతీకని ఆయన చూపిన మార్గంలో యువత నడవాలన్నారు.
దేశంలోని సంస్థానాలన్నింటిని భారతదేశంలో విలీనం చేసిన మహనీయుడు అఖండ భారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశ ఏకతకు, సామాజిక సమగ్రతకు చేసిన కృషి అపూర్వమన్నారు. ఆయన ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమని, దేశ ఐక్యతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమ సమన్వయకర్తగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎం.రంజిత్ రెడ్డి, జిల్లా యువజన అధికారి, మై భారత్, జిల్లా యువజన అధికారి ఖాసీం బేగ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్లు దీపికా, ప్రతిభ, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ విద్యాసంస్థల అధ్యాపకులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




