19-12-2025 08:50:29 PM
హాజరైన లీగల్ అడ్వైజర్ జడ్జి రామకృష్ణ
కోదాడ: గణపవరం గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బల్గురు స్నేహ దుర్గయ్య అభినందనీయములు అని ఐటి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ లీగల్ అడ్వైజర్ జడ్జి రామకృష్ణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గణపవరం గ్రామంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన బల్గూరి స్నేహ దుర్గయ్యను ఆయన ఘనంగా సన్మానించి మాట్లాడుతూ గ్రామంలో విద్యావంతులను మేధావులను పెద్దల సహకారంతో సమస్యలను తెలుసుకొని వాటిని తీర్చడంలో ముందుండాలని అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి జిల్లాలోనే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అన్నారు.