calender_icon.png 19 December, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధన మేరకు లే-అవుట్లకు అనుమతులు జారీ

19-12-2025 08:47:33 PM

జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ సంచిత్ గంగ్వర్

నారాయణపేట,(విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనలను అనుసరించి లే-అవుట్లకు  అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని  జిల్లా ఇన్ ఛార్జీ  కలెక్టర్ సంచిత్ గంగ్వర్ స్పష్టం చేశారు. శుక్రవారం  సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హల్ లో  ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ లేఔట్ కమిటీ సమావేశంలో ఆయన కలెక్టర్ మాట్లాడుతూ.. లేఅవుట్ల అనుమతుల జారీ  విషయంలో  సంబంధిత అధికారులు అన్ని  జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

సమావేశంలో జిల్లాలోని కోస్గి మున్సిపాలిటీకి సంబంధించి ఒకటి, మక్తల్ 2, మద్దూరు మున్సిపాలిటీకి సంబంధించి మరో 2  లేఅవుట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై ఇన్ ఛార్జీ కలెక్టర్ ఇరిగేషన్, పంచాయతీరాజ్, డిటిసిపిఓ, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఆయన క్లియరెన్స్ అడిగారు.  ఆయా శాఖల అధికారులు వచ్చిన 5 లే అవుట్ లకు గాను 4 కు  క్లియరెన్స్ ఇచ్చారు. మక్తల్ కు  సంబంధించిన  ఒక లే అవుట్ పై రెండు శాఖల అధికారులు శాఖ పరమైన అభ్యంతరాలు తెలిపారు.