లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు పత్రం అందజేసిన సర్పంచ్
నాగిరెడ్డిపేట్, జనవరి 2 (విజయ క్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతి ఒక్కరికి ఇంటి సౌకర్యం కలగాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలవారికి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటి కల నెరవేరుస్తున్న సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండలంలోని కన్నారెడ్డి గ్రామంలో గ్రామ సర్పంచ్ సాయిలు ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కొరకు ముగ్గు పోయడం జరిగింది.
ఈ సందర్భంగా కన్నారెడ్డి గ్రామ సర్పంచ్ సాయిలు, గ్రామ కార్యదర్శి రమేష్ చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారురాలు ఫిరంగి మైసమ్మకు ఇందిరమ్మ ఇల్లు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు ఫిరంగి మైసమ్మ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కృషి చేసిన గ్రామ సర్పంచ్ సాయిలుకు, గ్రామ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సాయిలు, రాజు, అరుణ్ కుమార్, మేస్త్రిలు సంజీవులు, సాయిబాబా, సాయిలు పాల్గొన్నారు.




