03-01-2026 12:03:13 AM
ఘట్ కేసర్, జనవరి 2 (విజయక్రాంతి) : వెంకటాపూర్ లోని అనురాగ్ విశ్వవిద్యాలయంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఐటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సేల్స్ఫోర్స్ ఏజెంట్ ఎక్స్ హ్యాకథాన్’ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో అనురాగ్ విశ్వవిద్యాలయ డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ విజయ్ కుమార్, అసోసియేట్ డీన్ డాక్టర్ చలపతి, డీన్ అకాడమిక్స్ డాక్టర్ కె. సుధీర్ రెడ్డి, డీన్ సీఎస్‌ఈ డాక్టర్ విష్ణుమూర్తి, డైరెక్టర్ అడ్మిషన్స్ డాక్టర్ శ్రీనివాస రావు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (ఐటి) డాక్టర్ నితీషా శర్మ, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ సిద్ధార్థ్ ఘోష్, ముఖ్య అతిధిగా ఆనంద శంకర్ జోర్దార్ (టెక్నికల్ కన్సల్టెంట్ సేల్స్ ఫోర్స్ వ్యూస్ ఆఫ్ మ్యూల్ సాఫ్ట్ అంబాసడర్) గౌరవ అతిథి బాలప్రసాద్ పెడ్డిగారి (ఐఈఈఈ హైదరాబాద్ సెక్షన్ వైస్ చైర్ అండ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్) కలిసి జ్యోతి ప్రజ్వలనం ద్వారా కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ హ్యాకథాన్లో విద్యార్థులు సెల్స్ ఫోర్స్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఆటోమేషన్, ఇంటిగ్రేషన్, బిజినెస్ యూజ్ కేస్లపై ఆధారిత సవాళ్లలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశాన్ని కల్పించిందని నిర్వాహకులు తెలిపారు. సేల్స్ ఫోర్స్ ఏజెంట్ ఎక్స్ హ్యాకథాన్’ ను విజయవంతంగా నిర్వహించే అవకాశాన్ని కల్పించినందుకు అనురాగ్ విశ్వవిద్యాలయ యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తేలియజేసారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఇన్నోవేషన్ స్పిరిట్ను మరింత ప్రోత్సహిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.