19 March, 2026 | 10:15 AM

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

19-03-2026 01:00 AM

చారకొండ మార్చి 18: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను బుధవారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ గౌడ్, మండల అధ్యక్షులు జమ్మికింది బలరాం గౌడ్ పంపిణీ చేశారు.

జూపల్లి గ్రామానికి చెందిన జమ్ముల తిరుపతయ్యకు మంజూరైన రూ. 44 వేల చెక్కును కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాకినమోని వెంకటయ్య యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైపాల్, ఎన్‌ఎస్ యూఐ మండల అధ్యక్షులు గోరటి శివ నాయకులు సాయి కృష్ణ, నారోజు నరసింహచారి, మాధవ రెడ్డి, శివరాం, జంగయ్య యాదవ్, మల్లయ్య, వెంకటయ్య రామస్వామి, రామకృష్ణ, గోపి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.