9 July, 2026 | 3:49 PM

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

09-07-2026 03:12 PM

ఆర్డీఓ రవీందర్ రెడ్డి...

బాన్సువాడ, జూలై 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్లో(Banswada division) సర్ ప్రక్రియలో భాగంగా కోట జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్డీవో రవీందర్ రెడ్డి చూపించారు.ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పురోగతిని బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో పర్యటించిన ఆయన, ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా బీఎల్ఓలతో సమావేశమైన ఇప్పటివరకు ఎన్ని ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించారో, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో ఎలాంటి అపోహలు లేకుండా విస్తృత అవగాహన కల్పించాలని బీఎల్ఓలను ఆదేశించారు. గతంలో ఓటు వేసిన వారు కూడా తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారం నింపాల్సి ఉంటుందని, లేకపోతే వారి పేరు ఓటరు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉందని ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫారాల సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని ఆదేశించారు. ఇళ్లకు వచ్చే బీఎల్ఓలు, బీఎల్‌ఏలకు ప్రజలు పూర్తి సహకారం అందించి, ఎన్యుమరేషన్ ఫారాలను సకాలంలో సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఎంపీడీవో ఆనంద్ ఉన్నారు.