8 May, 2026 | 1:05 AM

ఆంధ్ర ఇసుక అక్రమ రవాణా నిందితులను పరామర్శించిన సత్తుపల్లి ఎమ్మెల్యే!

08-05-2026 12:00 AM

అక్రమ ఇసుక రవాణా నిందితులను ఎమ్మెల్యే పరామర్శించడం దేనికి నిదర్శనం

సత్తుపల్లి, మే 7 (విజయక్రాంతి): సత్తుపల్లి నియోజకవర్గంను అక్రమ వ్యాపారాలకి అడ్డగా మారుస్తున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు. నెల రోజుల క్రితం ఆంధ్రా నుండి అనుమతులు లేకుండా తెలంగాణకి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు దొడ్డ శ్రీనివాసరావు కి చెందిన మూడు టిప్పర్లను వరంగల్ విజిలెన్స్ అధికారులు పట్టుకొని దొడ్డ శ్రీనివాసరావు మరియు అతని భార్య, కుమారుడు, కోడలుపై క్రిమినల్ కేసులు మరియు ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చినట్లు పలు సెక్షన్ లో కేసులు నమోదు చేశారు.

అప్పటినుండి సుమారు నెలరోజులు వరకు సదరు వ్యక్తులు పోలీసులకు దొరకకుండా పరార్ లో ఉండి సోమవారం హైకోర్టు నుండి యాంటీ స్పెక్టర్ బెల్ తీసుకొని స్వగ్రామైన బేతుపల్లి చేరుకున్నారు.

క్రిమినల్ మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చినటువంటి వ్యక్తులను నియోజకవర్గానికి ప్రజా ప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే పరామర్శించటం ఎంతవరకు సమంజసం. ఈ పరామర్శించటం ప్రజల్లోకి ఏ విధంగా సంకేతం ఇచ్చినట్లు అవుతుంది. క్రిమినల్ కేసుల్లో ఉన్న నిందితులను ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిది కలవడం ప్రజలకు ఏమి సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. నియోజకవర్గ అక్రమ వ్యాపారాలకు నిలయంగా మారుస్తూ నిందితులకు ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నట్లుగా భావించాలా  లేక అట్టి అక్రమ ఇసుక రవాణాకు బినామీగా కొంతమంది వ్యక్తులను పెట్టి సదర్ ప్రజాప్రతినిది నడిపిస్తున్నారని భావించాలా.