22 May, 2026 | 7:42 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

సతీలీలావతి

04-02-2025 12:00 AM

మనస్ఫూర్తిగా నవ్విస్తానంటున్న

ఆనంది ఆర్ట్స్ సమర్పణలో లావణ్య త్రిపాఠి, దేవ్ మోమన్ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న చిత్రం ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాలపై నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టిలు సంయుక్తం గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాతినేని సత్య దర్శకత్వం వహిస్త్నురు.

సోమవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘి హౌస్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్, చిత్ర సమర్పకులు జెమినీ కిరణ్, నిర్మాతలు హరీష్ పెద్ది, వి.ఆనంద ప్రసాద్, అన్నే రవి, సీనియర్ డైరెక్టర్ టి.ఎల్.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ముహూర్తపు సన్నివేశానికి హరీష్ పెద్ది క్లాప్ కొట్టారు. వరుణ్ తేజ్  కెమెరా స్విచ్ ఆన్ చేయగా, టి.ఎల్.వి.ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ.. “ఆహ్లాదాన్ని కలిగించే చక్కటి ఎంటర్‌టైనర్ ‘సతీ లీలావతి’.

మనస్ఫూర్తిగా నవ్వుకునే రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది” అన్నారు. నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి మాట్లాడుతూ “మా డైరెక్టర్ తాతినేని సత్యగారు స్క్రిప్ట్ చెప్పగానే నేటి తరం ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమా అనిపించింది. సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నాం. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తాం” అన్నారు.