4 April, 2026 | 2:42 PM

Breaking News

వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •  

జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం

04-04-2026 01:19 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు సమంజసం కావు..

కరీంనగర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ నేత జీవన్ రెడ్డి ఇటీవల సి ఎం పై చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తీవ్రంగా స్పందించారు. జీవన్ రెడ్డిపై తమకు గౌరవం ఉన్నప్పటికీ, పార్టీని వీడి బయటకు వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు.జీవన్ రెడ్డి రాజీనామా చేసేముందు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు ఆయనను కలిసి చర్చించినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా పార్టీని వీడినట్టు మల్లేశం గుర్తుచేశారు.

ఇటీవల జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆయన ఏ పార్టీలో చేరినా తమకు సంబంధం లేదని, అయితే ముఖ్యమంత్రి పై విమర్శలు చేయడం మాత్రం ఆమోదయోగ్యం కాదని మల్లేశం స్పష్టం చేశారు. “మార్పు రావాలి అంటే రేవంత్ రెడ్డి పోవాలి” అనే వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినవి కావని, అసలు మార్పు జీవన్ రెడ్డిలోనే వచ్చిందని విమర్శించారు. 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రస్తావిస్తూ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రూ.23 వేల కోట్ల రుణమాఫీ, రైతు భరోసా, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేశారు. రైతులకు సన్న వడ్లు పండించినందుకు రూ.500 బోనస్, మహిళలను ఆర్థికంగా బలపర్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం సమంజసం కాదని, ఇతర పార్టీల్లో ప్రాధాన్యం పొందేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని మల్లేశం హెచ్చరించారు. భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని జీవన్ రెడ్డికి సూచించారు.