సమవర్తిగా సత్యదేవ్
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సత్యదేవ్. ఆయన కథానాయకుడిగా మరో కొత్త సినిమా రానుంది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ సినిమా ఇది. దీనికి అజయ్ నాగ్ వీ దర్శకత్వం వహిస్తున్నారు. రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ బ్యానర్లపై శివచరణ్‌రెడ్డి జక్కిడి, శశిధర్‌రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సమవర్తి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ శుక్రవారం ఈ మూ వీ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు.
ఈ పోస్టర్‌లో సత్యదేవ్.. తనవైపు దూసుకొస్తున్న గొడ్డళ్లు, కత్తులకు ఏమాత్రం భయపడకుండా హెడ్‌ఫోన్స్‌లో పాటలు విం టూ ఇంటెన్స్ లు క్స్‌లో కనిపించడం ఆసక్తి క లిగిస్తోంది. ప్ర త్యేకంగా ఎకోలాజికల్ యాక్ష న్ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ఈ ప్రాజెక్టుపై మ రింత అంచనాలు పెంచుతోంది.
దిలీశ్ పోత న్, రాజీవ్ కనకాల, గనవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్ ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీతం: సింజిత్ యెర్రమల్లి; డీవోపీ: హర్ష మల్లికార్జున, దేవ్ దీప్ గండికుండు; ఎడిటర్: ఆదిత్య తివారి; ఆర్ట్: మొండ్రు రవికుమార్.






