బావా చీరాచొక్కాచిక్కడిపోవాలో..
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న భారీ యాక్ష న్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలా రు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయిక కాగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రుతిహాసన్ ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్, రెండు పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి.
శుక్రవారం చిత్రబృందం మూడో గీతం ‘హల్లల్లో’ ప్రోమోను విడుదల చేసింది. ‘హల్లల్లల్లో హల్లో హల్లల్లో.. బావా చీర చొక్కా చిక్కడిపోవాలో..’ అంటూ సాగనుందీ గీతం. రామ్‌చరణ్, శ్రుతిహాసన్, జాన్వీకపూర్.. ముగ్గురి స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటను మరింత గొప్పగా మార్చింది.
పూర్తి పాటను శనివారం భోపాల్‌లో జరగనున్న భారీ మ్యూజికల్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు. ఈ చిత్ర సంగీతం: ఏఆర్ రెహమాన్; డీవోపీ: ఆర్ రత్నవేలు; ఎడిటింగ్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.






