16 March, 2026 | 6:00 AM

ఘనంగా ఎమ్మెస్సార్ జయంతి

15-01-2026 01:20 AM

ముకరంపుర, జనవరి 14 (విజయ క్రాంతి): మాజీ మంత్రి, మాజీ పార్లిమెంట్ సభ్యులు యం సత్యనారాయణ రావు జయంతిని డిసిసి కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ తో పాటు పలువురు నేతలు హాజరై యం.ఎస్.ఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి వర్యులుగా, పిసిసి అధ్యక్షులుగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా యం.ఎస్.ఆర్ కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో సేవలందించారని కొనియాడారు.

అనంతరం బొబ్బిలి విక్టర్ ఆధ్వర్యంలో కరీంనగర్ సి ఎస్ ఐ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు, కేక్ కటింగ్ చేశారు. మేనేని రోహిత్ అన్న మిత్ర మండలి ఆధ్వర్యంలో కరీంనగర్ లోని స్థానిక కార్ఖనా గడ్డ వృద్ధాశ్రమం లో వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది. రేకుర్తిలోని బుడిగజంగాల కాలనీలో మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ గౌడ్, నాయకులు వెన్న రాజ మల్లయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, వంగల విద్య సాగర్, కర్ర రాజశేఖర్, అహ్మద్ అలీ, అబ్దుల్ రెహమాన్, అమీర్, మాదాసు శ్రీనివాస్, సిరిపురం నాగప్రసాద్, శిల్ప, పర్వత మల్లేశం, సత్తినేని శ్రీకాంత్, ముల్కల యోనా, తోట అంజయ్య, కుర్ర పోచయ్య, వీర దేవేందర్, కలీం, కాశి పాక రమేష్, సుంకరి గణపతి, తదితరులు పాల్గొన్నారు.