వేములవాడ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, జనవరి 14,(విజయక్రాంతి): వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గా ర్డెన్స్లో బుధవారం వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆ ది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. వేముల వాడ పట్టణం, రాజన్న ఆలయ సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఇప్పటికే రూ. 150 కోట్లతో అభివృద్ధి పనులు, రూ.47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం కొనసాగుతోందన్నారు. బైపాస్ రోడ్డుపై సెంట్రల్ లైటింగ్, అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కులమతాలకు అతీతంగా వివిధ సామాజిక భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో తప్పుదారి పట్టించే ప్రచారాలను నమ్మవద్దని, ఈసారి మున్సిపల్లో కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని కోరారు.




