వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
సుల్తానాబాద్ , నవంబర్ 5 (విజయ క్రాంతి);సామూహిక సత్యనారాయణ స్వా మి వ్రత వేడుకల ను వైభవంగా నిర్వహించారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండ లంలోనిఅయిత రాజుపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం సామూహిక సత్యనారాయణ వ్రతం కార్యక్రమాన్ని దంపతులచే ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్ల ను చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమి టీ చైర్మన్ దీకొండ భూమేష్ కుమార్ , ఆల య అర్చకులు నాగేంద్ర చార్యులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






