06-11-2025 01:04:25 AM
మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు ఎస్‌ఐ రవికుమార్
ముత్తారం నవంబర్ 05 (విజయక్రాంతి) ఎలాంటి అనుమతులు లేకుండా మానేరు నది నుంచి ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ముత్తారం ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. బుధవారం ఉదయం తన సిబ్బంది తో ఓడేడు గ్రామం లో పెట్రోల్లింగ్ చేస్తుండంగ గ్రామ శివారులో కి రెండు ఇసుక ట్రాక్టర్లు అనుమానాస్పడంగ కనిపించగా వారి దగ్గరికి వెళ్లి విచారించగా అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్లని డ్రైవర్లు తెలిపారని,
వారు ఓడేడు మానేరు నుండి అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను రావణా చేస్తుండంగ పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలిపారు. మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.