23 March, 2026 | 9:03 AM

మొదటిసారిగా బహుగుళ్ళ గుట్టపై సత్యనారాయణ స్వామి వ్రతం

23-03-2026 12:32 AM

ముత్తారం, మార్చి22(విజయ క్రాంతి) ముత్తారం మండలం మచ్చుపేట గ్రామపంచాయతీ పరిధిలోని బహుళ గుట్టపై మొదటిసారిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మచ్చుపేట గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ దొంతుల రాకేష్ అక్క బావ గంప రాధిక - భాస్కర్ బహుగుళ్ళ గుట్టపై సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉప సర్పంచ్ దొంతుల రాకేష్ మాట్లాడుతూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలలోనే ప్రజల ఆకాంక్ష మేరకు బహుగుళ్ళ గుట్టకు రూ.2 కోట్ల తో సిసి రోడ్డు నిర్మాణం,

అదేవిధంగా పవర్ సప్లై ఏర్పాటు చేయటం వలన బహుగుళ్ల దేవస్థానం మరింత అభివృద్ధి చెందిందని తెలిపారు. బహుగుళ్ళ గుట్ట పై విఘ్నేశ్వర స్వామి, జోడు లింగాలు, వెంకటేశ్వరస్వామి, శివాలయం, హనుమాన్, నాగులమ్మ, కాళికామాత దేవస్థానముల మధ్యలో మొదటి సారిగా బహుగుళ్ళ గుట్టపై సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని పూజలో కూర్చున్న దంపతులు గంప రాధిక - భాస్కర్, గంప మౌనిక - కుమార్, గంప దుర్గా-క్రిష్ణ సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాకుండా బహుగుళ్ళ గుట్టపై మాతో మొదలైన సత్యనారాయణ స్వామి వ్రతం మరెందరికో ఆదర్శంగా ఉండాలని ఇక్కడ పూజలు, వ్రతాలు చేయడం ద్వారా బహుగుళ్ళ దేవస్థానం మరింత అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు.