10 June, 2026 | 3:52 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా ముందుకు

23-03-2026 12:33 AM

బేవరేజెస్ కార్పొరేషన్ అధికారుల సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ స్టోర్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషిచేస్తూ ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ స్టోర్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం, జనరల్ బాడీ మీటింగ్ ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ మద్యం డిపోలలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆప్కారి భవన్ ప్రధాన కార్యాలయం ఉద్యోగులు హాజరయ్యారు.

ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భం గా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై చర్చించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్‌ను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తిచేయాలని తీర్మానంచేశారు.

చిరు ఉద్యోగుల సాధక బాధలను కమిషనర్‌కు వివరించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో తెలంగా ణ బేవరేజెస్ కార్పొరేషన్ స్టోర్స్ ఆఫీసర్స్,  అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్‌లు గంగా, ధీరజ్, లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ యాకూబ్ నాయక్, కోశాధికారి శివకుమార్, కో ఆర్డినేటర్ ఆనందకుమార్, విఠల్, ఝాన్సీ, బాలచందర్ తదితరులు పాల్గొన్నారు.