7న బస్ భవన్ బచావో
- టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ పిలుపు
ఏ జీఎస్టీ, ఇన్కం ట్యాక్స్ శాఖలకు కేటాయించడంపై అభ్యంతరం
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఆర్టీసీ సంస్థ తరఫున బస్ భవన్‌ను నిర్మించుకుని దశాబ్దాల కాలం పాటు ఉమ్మడి రాష్ట్రం తో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు, సం స్థకు సంబంధించిన కార్య కలాపాలను కొనసాగిస్తూ వస్తోంది. ఇందులో ఎఱూ బిఱూ బ్లాక్ పేర్లతో విభజించి ఎ బ్లాక్‌ను ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి, బీ బ్లాక్‌ను తెలంగాణ ఆర్టీసీకి కేటాయించారు.
ఏపీ ఆర్టీసీ తరలివెళ్లిన తర్వాత ఏ బ్లాక్ ఖాళాగా ఉంటోంది. తెలంగాణ ప్రభు త్వం మార్చి 31న ఏ బ్లాక్‌ను జిఎస్టీ, ఇన్కం ట్యాక్స్ శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఆయా శాఖల ఉన్నతాధికారులు బస్ భవన్‌కు చేరుకుని ఏ -బ్లాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలను టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వం విడుదల చేసిన జీవో రద్దుతో పాటు - బ్లాక్‌ను వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది.
షెడ్యూల్-9లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తుల పంపకాలు నేటివరకు పూర్తి కానప్పటికీ, విధా న పరమైన నిర్ణయాలు ఆర్టీసి ఉమ్మడి ఆస్తుల పై జరగనప్పటికీ, అలాగే కార్పొరేషన్ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేనప్పటికీ అధికార బలంతో ఏకపక్షంగా ఆర్టీసీ కార్యాలయాన్ని స్వాధీన పరచుకోవడం సమంజసం కాదని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం.థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండి.మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాద య్య, సుద్దాల సురేష్, బి.యాదగిరి గురువారం జరిగిన సమావేశంలో అన్నారు.
ఆర్టీసి ఆస్తులను కొల్లగొట్టాలనే ఆలోచనతో, ఆర్టీసిని ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే సంస్థలో ఒక్కొక్కటిగా అన్యాక్రాంతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, దీనికి నిరసనగా ఈ నెల 7న “బస్ భవన్ బచావో” కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్టు తెలిపారు. అన్ని కార్మిక సంఘాలకు చెందిన నాయకులు, కార్మికులు తమ తమ విభేదాలు విడనాడి, ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
అలాగే అన్ని జిల్లాలలోని డిపోలలో గేటు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు పెద్దయెత్తున నిర్వహించాలని కోరారు. సమావేశంలో జెఎసి కోశాధికారి బి.యాదయ్య, జె.రాఘవులు, ఎన్.కమలాకర్ గౌడ్, డి.గోపా ల్, బుద్ధ విశాల్, నగేష్ పటేల్, రాం చందర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.




