3 April, 2026 | 3:52 AM

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

03-04-2026 02:05 AM

హనుమకొండ వడ్డేపల్లిలో సోదాలు

మహబూబాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని హనుమ కొండ వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ జరిగి నాలుగు నెలలుగా ఫైళ్లను తమ వద్దే అట్టిపెట్టుకున్నారని, లంచం ఇస్తేనే ఫైళ్లు ఇవ్వడం లేదనే ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో గురువారం మధ్యాహ్నం వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ 1, 2 కార్యాలయాల్లో తని ఖీలు నిర్వహించారు.

ఏజెంట్ల మధ్యవర్తిత్వం తో అధికారులు ఫైళ్లను పెండింగ్‌లో పెట్టుకున్నారు అనే ఫిర్యాదులు రావడంతో తని ఖీలు నిర్వహించినట్లు ఏసీబీ డిఎస్పి తెలిపారు. జాయింట్ సబ్ రిజిస్టర్ 1, 2 కార్యా లయాల్లో 204 పైగా ఫైళ్లను పెండింగులో పెట్టి, ఏజెంట్ల ద్వారా 20 వేల నుంచి లక్ష వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అం దాయని, ఆ మేరకు రికార్డులను స్వాధీనం చేసుకున్నామని, అలాగే అనధికారికంగా 20 మంది డాక్యుమెంట్ రైటర్స్ 70 డాక్యుమెంట్లతో క్యూ లైన్‌లో ఉన్నారని, వారి నుంచి రూ.45 వేలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

రికార్డులను పరిశీలించి, ఏ మేరకు అవినీతి జరిగిందనే విషయాన్ని నిర్ధారించిన తర్వాత చర్యలు తీసుకుంటామని డిఎస్పి వెల్లడించారు. అయితే ఏసీబీ తనిఖీల సమయంలో అధికారులు, ఉద్యోగులు విధుల్లో హాజరైనట్లు సంతకాలు పెట్టినప్పటికీ, కార్యాలయంలో ఎవరూ లేరని డీఎస్పీ తెలిపారు.