04-02-2026 02:37:38 PM
సేవ్ టు ఎల్లారెడ్డి
రెండున్నర సంవత్సరాలు గడిచిన ఎల్లారెడ్డి పట్టణంలో అభివృద్ధి చేసిందేమీ లేదు
జీవోలు ఉంటే తీసుకురా మాట్లాడదాం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సవాల్
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పురపాలక పట్టణంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఆయన ఫామ్ హౌస్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12 వార్డులకు కౌన్సిల్ అభ్యర్థులను ఖరారు చేసామని ప్రచారం కూడా కొనసాగిస్తున్నామని రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ, గెలుపు ఖాయమని భీమా వ్యక్తం చేశారు. పత్రికా సమావేశంలో మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎప్పుడు వెనుకబడిన ప్రాంతమని అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తుత శాసనసభ్యులు మదన్మోహన్ రావు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని మండిపడ్డారు.
అయ్యా మదన్ మోహన్ రావు గతంలో ఉమ్మడి నిజాంబాద్ జిల్లా ఉన్నప్పుడు ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణం ఉన్నదని మున్సిపల్ పట్టణానికి అప్పట్లోనే మై సన్ వకీల్ సాబ్ అనే వ్యక్తి చైర్మన్గా పనిచేశారని ఆ విషయం నీకు గతం తెలువదని తెలుసుకొని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యా ఎమ్మెల్యే ఎల్లారెడ్డి కి 120 సంవత్సరాల క్రితమే తాసిల్దార్ కార్యాలయం నిర్మాణం జరిగింది వ్యాపారస్తులు ఎల్లారెడ్డి పట్టణంలో కొన్ని జిల్లాలకు వాళ్ళ వ్యాపారం కొనసాగించే వారిని ముత్యాల వెంకటరామయ్య మరియు పలువురు పేర్లు మాజీ ఎమ్మెల్యే ప్రస్తావించారు. అప్పట్లోనే ఎల్లారెడ్డి పట్టణంలో సినిమా థియేటర్ వ్యాపార సముదాయాలు వంటి అభివృద్ధి కొనసాగిందని అది నీకు తెలియదని ఊరికేనే అసెంబ్లీలో ఎల్లారెడ్డి అంటే గరీబ్ ఎల్లారెడ్డి అని మాట మాటకు చెప్పడం మా ఎల్లారెడ్డి ప్రజలు సుమారు రెండు లక్షల ఓటర్ల సిగ్గు తీస్తున్నావని ఎద్దేవా చేశారు.
భారతీయ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో భారతీయ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, కల్వకుంట్ల తారక రామారావు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు చేతుల మీదుగా ఎల్లారెడ్డి పట్టణంలో ఐదున్నర కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్ నిర్మాణం నిధులు మంజూరు చేసింది మేము కాదన 19 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి పట్టణంలో సోమరిపేట రోడ్లో 200 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టింది బిఆర్ఎస్ పార్టీ కాదా, 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా సుమారు 20 కోట్ల రూపాయల నిధులతో సమకూర్చి మంజూరు చేసింది బిఆర్ఎస్ పార్టీ కాదా, ఎల్లారెడ్డి పట్టణంలో మూడు కోట్ల రూపాయలతో చిల్డ్రన్ పార్క్ నిర్మాణం చేసింది మేము కాదా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఐదు కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసి అర్ధంతరంగా పనులు చేయలేక అక్కడే అసంపూర్ణంగా ఉన్నది మేము కాదా ఎల్లారెడ్డి పురపాలక పట్టణంలో సెంట్రల్ లైటింగ్ డివైడర్ గల్లీలలో సిసి రోడ్లు వంటి పనులను చేసింది బిఆర్ఎస్ పార్టీ కాదా, అని మండిపడ్డారు.
కరోనా కష్టకాలంలో ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు ఎల్లారెడ్డి నుండి మెదక్ వెళ్లే ప్రధాన రహదారి మార్గమధ్యలో దేవునిపల్లి శివనగర్ వద్ద రెండు బ్రిడ్జి నిర్మాణ పనులు చేసింది బిఆర్ఎస్ పార్టీ కాదా, అని హెచ్చరించారు. నిన్న గాక మొన్న నాలుగు నెలల క్రితం అకాల వర్షాలకు ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారి మార్గమధ్యలో లింగంపల్లి వద్ద వంతెన తెగిపోతే ఇప్పటికి కూడా కనీసం ఒక వంతెన నిర్మాణం చేపట్టలేని, దుస్థితిలో ఉన్నారు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి సంబంధిత శాఖ మంత్రులను తెచ్చి కనువింపు చేసి కనీసం బ్రిడ్జిని కూడా నిర్మాణం చేయలేని పరిస్థితిలో నీ ప్రభుత్వము ఉంది, హనీ మండిపడ్డారు. రైతులకు 1800 మంది రైతులకు ఇంకా మూడు కోట్ల 28 లక్షల రూపాయల బోనస్ సన్న రకం వాటిలకు పడలేదని వెంటనే సన్న రకం వాటిలో పెట్టిన రైతులకు బోనస్ వెయ్యాలని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్లో గత ప్రభుత్వంలో ఇప్పటికే రైతులకు రైతు,బంధు, పథకం డబ్బులు రైతుల ఖాతాలో జమయి అని ఇప్పటికీ పంటలు సాగు చేసి సగం రోజులు అయినప్పటికీ డబ్బులు వేయక మాటలు చెప్పుకుంటూ పూట గడుపుతున్నారని మండిపడ్డారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు కావాలని వరల్డ్ బ్యాంకు లెటర్ రాసిన మహానుభావుడ అభివృద్ధి ఎక్కడుంది చూపించు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటికీ రెండున్నర సంవత్సరాలు ఏర్పడిన నువ్వు తీసుకొచ్చిన కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి అభివృద్ధి ఎక్కడుందో చూపించాలని సవాల్ విసిరారు. ఆటో డ్రైవర్లకు, నెలసరి వేతనం కింద ఆసరా పెన్షన్లు మహిళలకు 4000 రూపాయల పెన్షన్లు మహాలక్ష్మి 2500, కళ్యాణ్ లక్ష్మి తో పాటు తులం బంగారం, విద్యార్థులకు గురుకుల పాఠశాలలో త్రాగునీరు మురుగునీరు వస్తున్నప్పటికీ కనీసం ఒకరోజు కూడా విజిట్ చేయలేని దుస్థితిలో ఉన్న ఎమ్మెల్యే నువ్వని మండిపడ్డారు.
ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో కోటి రూపాయలతో డయాలసిస్ సెంటర్ ను మరియు బస్సు దావకానాలను బిఆర్ఎస్ పార్టీ, ప్రవేశపెట్టిందని అది మరిచి ఫ్లెక్సీ లలో ఫోటోలకు ఫోజులిచ్చుకుంటూ మీరు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు జనార్దన్ గౌడ్ ఉమ్మడి నిజాంబాద్ జిల్లా మాజీ చైర్మన్ దాఫెదర్ రాజు, ఎల్లారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు జలంధర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఆదిమూలం సతీష్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముత్యాల సుజాత మరియు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.