సైబర్ మోసాలపై ఎస్‌బీఐ అవగాహన
25-02-2026 12:00 AM
నిజామాబాద్, ఫిబ్రవరి 24(విజయక్రాంతి): నిజామాబాద్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినాయకులభావి బ్రాంచిలో మంగళవారం ఖాతాదారులకు కస్టమర్ కనెక్ట్, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ బిజయ్‌కుమార్ సాహు, రీజినల్ మేనేజర్ మహేశ్వర్ కోలేటి, బ్రాంచ్ మేనేజర్ అఖిలాండేశ్వరి, ప్రేమ్‌కుమార్, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా 30 మంది ఖాతాదారులకు లాకర్ కీని అందజేశారు.




