25 February, 2026 | 12:00 AM

తెలంగాణలో ఎస్‌బీఐ లైఫ్ మూడు కొత్త శాఖలు

24-02-2026 10:16 PM

ఫిబ్రవరి 2026: భారతదేశపు అత్యంత విశ్వసనీయ ప్రైవేట్ రంగ జీవిత బీమా దిగ్గజాల్లో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొత్తగా మూడు శాఖలను ప్రారంభించడం ద్వారా తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకుంది. బీమాను అందరికీ అందుబాటులోకి తేవడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తులు మరియు కుటుంబాల అవసరాలకు అనుగుణమైన ఆర్థిక పరిష్కార మార్గాలను అందించడంపై కంపెనీకి గల చిత్తశుద్ధికి ఈ విస్తరణ నిదర్శనంగా నిలుస్తుంది.

ఎస్‌బీఐ లైఫ్ రీజనల్ మేనేజర్ (రిటైల్ ఏజెన్సీ) , పి. వంశీధర్ రెడ్డి , ఎస్‌బీఐ లైఫ్ డీఆర్ఎం (రిటైల్ ఏజెన్సీ) , ఎప్పా రవీందర్, ఎస్‌బీఐ లైఫ్ డీఆర్ఎం (రిటైల్ ఏజెన్సీ) , శ్రీనివాస్ కూర్మల , ఇతర ప్రముఖుల సమక్షంలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రీజనల్ డైరెక్టర్ (తెలంగాణ) అభిషేక్ కర్ మజుందార్ ఈ శాఖలను ప్రారంభించారు. ఈ కొత్త శాఖలతో తెలంగాణలో ఎస్‌బీఐ లైఫ్ శాఖల సంఖ్య 56కి చేరినట్లవుతుంది. ప్రాంతీయంగా డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మరింత పటిష్టమవుతుంది. కార్యకలాపాలు మరింత విస్తృతం అవుతాయి. కస్టమర్లకు సౌకర్యవంతంగా, నిరాటంకమైన మద్దతు ఉండేలా పాలసీల జారీ, ప్రీమియం వసూళ్లు, పాలసీ సర్వీసింగ్, క్లెయిమ్స్‌పరమైన సహాయం మొదలైన సమగ్ర సర్వీసులన్నీ కొత్త శాఖల్లో లభిస్తాయి.

ప్రాంతీయంగా బీమా లభ్యతను మరింతగా పెంచడంపై గల నిబద్ధతతో, పటిష్టమైన డిజిటల్ సామర్థ్యాలు, విస్తృత సర్వీస్ వ్యవస్థ దన్నుతో, భద్రత, పొదుపు, రిటైర్మెంట్‌కి సంబంధించి సమగ్ర పథకాలను ఎస్‌బీఐ లైఫ్ అందిస్తోంది.  కొత్తగా ప్రారంభించిన శాఖల్లో పాలసీ జారీ మరియు సర్వీసింగ్, ప్రీమియం రెన్యువల్స్, క్లెయిమ్ సంబంధ సందేహాల పరిష్కారం మొదలైన సేవలన్నీ అందుబాటులో ఉంటాయి. తద్వారా ప్రతి దశలోనూ సకాలంలో మార్గదర్శకత్వం, విశ్వసనీయమైన సర్వీసు లభిస్తుంది.