ఎస్‌బీఐ 71వ బ్యాంక్ దినోత్సవం
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 71వ బ్యాంక్ దినోత్సవాన్ని హైదరాబాద్‌లో ఘనం గా నిర్వహించింది. హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) నీలేష్ ద్వివేది నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో జనరల్ మేనేజ ర్లు సతీష్ కుమార్ (నెట్వర్క్ రణవిజయ్ ప్రతాప్ (నెట్వర్క్ ఆర్. గణేష్ (సీసీజీఆర్వో), డీజీఎం, సీడీఓ సురజిత్ త్రిపాఠి పాల్గొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సికింద్రాబాద్‌లోని సాధన ఇనిస్టిట్యూట్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్‌కు ప్ర త్యేక మినీ వ్యాన్‌ను,
హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌కు 52 సీట్ల బస్సును విరాళంగా అందజేశారు. వాహనాలను మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ జి.ఎల్.కె. దుర్గ (చైర్‌పర్సన్), ప్రిన్సిపాల్ శ్రావ్య స్పందన స్వీకరించారు. అలాగే జాతీయ వై ద్యుల దినోత్సవం సందర్భంగా 11 మంది బ్యాంక్ మెడికల్ ఆఫీసర్లు, ఆరోగ్య నిపుణులను సన్మానించ గా, చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా ప్రముఖ ఆడిటర్లు సి.ఎస్.ఆర్. మూర్తి, డి. విజయ్ కుమార్లను సీజీఎం నీలేష్ ద్వివేది ఘనంగా సత్కరించారు.






