ఇందిరమ్మ ఇంటి పంచాయతీ!
- ఆదివాసి గూడెంలో అటవీశాఖ అడ్డు పుల్ల
- అడవి బిడ్డలకు దక్కని ఇందిరమ్మ గౌరవం
- ఇండ్లు మంజూరైనా కట్టుకోలేని దుస్థితి
నిర్మల్ జూలై ౧ ( విజయ క్రాంతి): దేవు డు వరమిచ్చిన.. పూజారి కరుణా లేదు అనే రీతిలో నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కొనసాగుతోంది. ప్రభుత్వం పేద ప్రజలకు సొంతింటి కలలు సహకారం చేసేందుకు ఐదు లక్షలతో ఇందిర ఇల్లు మంజూ రు చేస్తే నిర్మల్ జిల్లాలో ఆదివాసి గిరిజన గూడెంలో పదవి చట్టాలు పేరుతో అడ్డుకుంటున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మారుమూల ఆదివాసీ గిరిజన గూడెం 70% గిరిజనులు గూడేలు కట్టలతో తయారుచేసుకొని రేకుల షెడ్లతో ఉన్న ఇండ్లలోని జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో దరఖాస్తులను ఆహ్వానించింది. నిర్మల్ జిల్లాలో సొంత ఇంటి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం మంజూరు చేస్తామని ప్రకటించడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా 72,000 పైగా దరఖాస్తు చేసుకోగా మొదటి విడత కింద 8166 ఇళ్లకు మంజూరు ఇచ్చారు. ఇందులో ఇప్పటివరకు గ్రౌండింగ్ 67 68, చేయగా 13 39 ఇందిరమ్మ ఇళ్లకు మార్కౌంటు ఇచ్చారు. ఇందులో 1140 బేస్మెంట్, 805 గోడలు, 1676 స్లాబు, లెవెల్ లో ఉండగా 2091 ఇండ్లు పూర్తిచేసి ఇటీవలే ప్రారంభించారు.
ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంలో ప్రభుత్వ భూములతో పాటు సొంత ఇంటి స్థలం ఉన్నవారికి ఇంద్రం ఇళ్లను మంజూరు చేయగా నిర్మల్ జిల్లాలో మైదాన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొంత పురోగతి ఉన్న ఆదివాసిగూడలో మాత్రం అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు
అడ్డుకుంటున్న అటవీ శాఖ అధికారులు
నిర్మల్ జిల్లాలో అరులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మొదటి విడత కింద నిర్మల్ జిల్లాలోని నిర్మల్ ఖానాపూర్ ముధోల్ నియోజకవర్గం 3000 చొప్పున ఇండ్ల మంజూరు కి ప్రభుత్వం రిం సిగ్నల్ ఇచ్చింది. అయితే నిర్మల్ జిల్లాలోని ఏజెన్సీ మండలాలతో పాటు అటవీ శాఖ పరిధిలో ఉన్న గిరిజన గూడెం ఇంటి నిర్మాణం పై అటవీ శాఖ అధికారులు ఇస్తున్నారు.
నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన మండలాలైన పెంబి కడెం దస్తురాబాద్ సారంగాపూర్ మామడా కుబీర్ కుంటాల నర్సాపూర్ మండలంలోని పలు ఆదివాసి గిరిజన గూడ లో ఇండ్ల నిర్మాణం పై అటవీ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా జిల్లాలో పెంబి కడెం, దస్తురాబాద్ మామడ సారంగాపూర్ రైతుల మండలాల్లోని రాయదారి పోచంపల్లి, అంకెన, జీడిపల్లి ,తాటి గూడా,పసుపుల, సూర్యంతండా, రాగి దుబ్బ, కొల్లం గు డా, కోరుకంటి, కోరు కంటి తండా, ఇటిక్యాల కడెం మండలంలోని గంగాపూర్ లక్ష్మీపూర్ సోమవార్పేట్ మామడ సారంగాపూర్ మండలంలోని సోనాపూర్ ఆర్కాయ్ పేట్ కుబీర్ కుంటాల మండలంలో కూడా అనేక ఆదివాసి గిరిజనులు ఇందిరమ్మ ఇండ్ల కోసం కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం సర్వే అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది.
అయితే ఈ ఆదివాసి గిరిజన గుడాలు ప్రజలు ఫారెస్ట్ లో అటవీ ప్రాంతంలో ఉండడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు అనుమతులు లేవని అడ్డుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు వాడే ఇసుక ఇటుక మట్టిని ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి వినియోగించకుండా గిరిజనులపై ఆంక్షలు పెట్టి కేసులు పెడుతున్నారు. ఒక్కొక్క గిరిజన గూడెంలో 40 నుంచి 50 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో అనేక సమస్యల మధ్య గూడెం నివసిస్తున్న తమకు కనీస ఇంటి సౌకర్యమైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం అడ్డుకోవడంపై వారు మండిపడుతున్నారు.
ఇప్పటికి చాలా గ్రామాల్లో ఆదివాసి గిరిజనులు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు పునాదులు తవ్వి బేస్ మెట్లు కట్టుకున్న అది అనుమతులు లేవని అటవీశాఖ అధికారులు నోటీసు ఇచ్చి పనులు ఆపాలని లేకుంటే కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నట్టు ఆదివాసి గిరిజను లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసే అంగన్వాడి పాఠశాల భవనాలకు సిసి రోడ్లు కూడా ఆదివాసి గిరిజన గోడలు అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆదివాసి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇప్పటికీ అనేకసార్లు ఆదివాసి గిరిజనులు స్థానిక ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్లకు మొరపెట్టుకున్న ఈ సమస్య పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఆదివాసి గిరిజన గూడాలలో అటవీ శాఖ అధికారుల వైఖరిపై ఖానాపూర్ ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫలితం మాత్రం కనిపించడం లేదు.
ఆదివాసి గిరిజన గూడాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రతిరోజు అటవీశాఖ అధికారులు డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు గిరిజన గూడెం ఇందిరమ్మ ఇంటికల సహకారం నెరవేరకపోవడంతో తమకు అధికారులు న్యాయం చేసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం అనుమతులు ఇవ్వాలని మెటీరియల్ సరఫరాకు ఆంక్షలు ఎత్తివేయాలని ఆదివాసి గిరిజనులు జిల్లా కలెక్టర్కు పలుమార్లు విన్నవిస్తున్నారు
సమస్య జటిలం. కలెక్టర్ దృష్టి
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసి గిరిజన గూడలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళను అడ్డుకోవడం లేకుండా ఇసుక మొరం లేకుండా ఫంక్షన్ విధిస్తున్న వైనంపై అటవీశాఖ అధికారులకు వీటి గిరిజనుల మధ్య పంచాయతీ ప్రారంభమైంది. సంవత్సరాలుగా అటవీ ఉత్పత్తులను జీవనాధారంగా చేసుకొని సాగుతున్న తమకు అటవీ సంపదపై ఉన్న హక్కులను అటవీ శాఖ అధికారులు అనుమతుల పేరుతో అడ్డుకోవడంపై ఆదివాసి గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాము అటవీ సంపద దోచుకోవడం లేదని ఉండటానికి కనీసం ఇంటి నిర్మాణానికి మాత్రమే అనుమతులు ఇవ్వాలని కోరుతున్న అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంపై వారు మండిపడుతున్నారు. ఇప్పటికీ ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి అటవీశాఖ అధికారుల తీరుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సైతం ఈ సమస్యను ప్రాధాన్యతగా తీసుకొని శాఖల మధ్య లోపించిన సమన్వయాన్ని పరిష్కరించేందుకు కోఆర్డినేషన్ మీటింగ్లు ఏర్పాటు చేసి అటవీ హక్కు చట్టాలు గిరిజనుల సమస్యలపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అరులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం నిర్మించే లక్ష్యం ప్రభుత్వం అని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.






