ఎస్సీ ఎస్టీ, బిసి విద్యార్థులకు ఉచిత విద్యని అందించాలి
జనగామ: 2009 విద్య హక్కు చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ, బిసి విద్యార్థులకు 25 శాతం ఉచిత విద్య అందించాలని ఎఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం డిమాండ్ చేశారు. జనగామ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ... ప్రారంభమవుతున్న ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఫీజులు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. జిల్లాలో అనుమతులు లేకుండా కొన్ని ప్రవేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ అడ్మిషన్ చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ ఫీజులు సైతం భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారని అన్నారు.
అదేవిధంగా ఫీజులు అద్దులు లేకుండా మితిమీరి పెంచుతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర జలగల పిడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం పూర్తి చేసిన పదో తరగతి విద్యార్థుల దగ్గర నుండి స్టడీస్ సర్టిఫికెట్ టిసి పేరుతో పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్య హక్కు చట్టాన్ని అమలు చేయని పాఠశాలపై తగిన చర్యలు తీసుకోవాలని. మండల విద్యాశాఖ అధికారులు పర్మిషన్ లేకుండా పాఠశాలలు నడుపుతు L.K.G చదివే విద్యార్థులకే 20వేల పైన ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి దండుకుంటున్న అధికారులు పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు.
స్కూల్ అడ్మిషన్లు చేస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం విడ్డూరంగా ఉందని ప్రవేట్ పాఠశాలలో దాన దాహానికి పేద మధ్య తరగతి కుటుంబాలు నలిగిపోతున్న అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలి అన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాల విద్యార్థులకు 25% ఉచితంగా విద్యను అందించాలి పాఠశాలలో యూనిఫామ్ నోట్ బుక్స్ అమ్మకాలను నిషేధించాలి గుర్తింపు లేని పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దాసగానీ సుమా జిల్లా సహాయ కార్యదర్శి యకన్న రాథోడ్ నాయకులు సంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






