calender_icon.png 13 May, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలి

13-05-2025 12:17:35 AM

భద్రాచలం, మే 12 (విజయ క్రాంతి) రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించి అన్ని సంక్షేమ పథకాలలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం పథకం  ద్వారా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఎస్సీ వర్గీకరణ ప్రకారమే అమలు చేయాలని దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య డిమాండ్ చేశారు.

సోమవారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగం అమలైన 1950వ సంవత్సరము నుండి ఇప్పటివరకు 75 సంవత్సరాల కాలంలో ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా షెడ్యూల్ కులాలలో ఒక కులమే అన్ని సంక్షేమ పథకాలను మరియు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో అనుభవించడం జరిగింది. గత 75 సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గా మాదిగ ఇతర నిరుపేద ఎస్సీ కులాలు ఉపాధి అవకాశాలు పొందలేకపోయారు.

ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, ఈ వర్గీకరణ చట్టం ద్వారానే రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకంలో వర్గీకరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి,మంత్రులు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎం రాజమ్మ,ఎం పౌలు, ఎమ్  రోహిత్, జీవ,ఎం పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.