ఇసుకాసురులు
- అక్రమార్కులకు అండగా ఖాకీలు !
- అధికార పార్టీ లీడర్లదే హస్తం
- చక్రం తిప్పుతున్న మాజీ పోలీస్
- పట్టించుకోని మైనింగ్ అధికారులు
నాగర్‌కర్నూల్, ఆగస్టు 23 (విజయక్రాంతి): జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపో తున్నారు. దుందుబీ నది పరివాహక ప్రాంత ఇసుక మేటలను అధికార పార్టీకి చెందిన కొ ందరు లీడర్లు తోడేళ్ల మాదిరిగా వ్యవహరిస్తూ తోడేస్తున్నారు. వాహనాల్లో పరిమితికి మించి రాత్రింబవళ్లు అక్రమంగా సరఫరా చేస్తున్నారు. ఇదంతా ఓ మాజీ పోలీస్ అధికారి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు సమా చారం. తన పరపతిని ఉపయోగించి ఖాకీల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జ రుగుతోంది.
నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లలో సరఫరా చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. అక్రమంగా ఇసుక వ్యాపారం జరు గుతున్నా పోలీసులు, మైనింగ్, రెవెన్యూ తదితర శాఖలు పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధుల సహకారంతోనే జరుగుతోందా లేక వారి పేర్లతో లీడర్లు గుట్టుగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిక లోడ్‌లతో భారీ ఇసుక వాహనాలు వెళుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసం అవుతున్నాయి.
తెరవెనుక మాజీ పోలీస్ చక్రం!
కొద్దికాలం పాటు జిల్లాలోని నిఘా విభాగంలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్ అధికార పార్టీ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.ఇసుక దందాకు కొన్ని భారీ వాహనాలు ఏర్పాటు చేసుకున్నాడు. దుం దుబీ పరివాహక ప్రాంతాల్లోని తాడూరు మండలం పొల్మూర్, మేడిపూర్, తెలకపల్లి మండలంలోని రామగిరి, నడిగడ్డ ప్రాంతాల్లోని ఇసుక మేటల నుంచి పట్టణ, మండల, గ్రామీణ ప్రాంతాలకు ఇసుకను అమ్ముకుని కోట్లు సొమ్ము చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది.
తనకు ఉన్న పరిచయాలతో ఇసుక మాఫియాకు కూడా పరోక్ష అనుమతులను ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నా యి. ఇందుకు ఓ పోలీస్ అధికారి వద్ద డీల్ కుదుర్చుకున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్న భారీ వాహనాలు కంటపడినా ఎవరూ నిలువరించడం లేదన్న వాదన వినిపిస్తోంది.
కొత్త ప్రభుత్వంలోనైనా మన ఇసుక వాహానం ద్వారా చౌకగా ఇసుక దొరుకుతు ందని సామాన్యులు సంబుర పడ్డారు. కానీ లీడర్లు తెరవెనుక అన్ని శాఖల అధికారులను మేనేజ్ చేసుకుని తమ దందా కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ప్రతినెలా ముడుపులు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మన ఇసుక వాహనానికి మైనింగ్ అధికారులు మంగళం పాడినట్లుందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అ క్రమ ఇసుక దందాను అరికట్టి మన ఇసుక వాహనాన్ని సక్రమంగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పలు శాఖల అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాఇటులోకి రాలేదు.






