calender_icon.png 21 January, 2026 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదింటి ఆడబిడ్డలకు అండగా పథకాలు

21-01-2026 12:04:28 AM

మొయినాబాద్,జనవరి 20 (విజయక్రాంతి ): మొయినాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పంపిణీ చేశారు. మొయినాబాద్ మండల, మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులకు రూ. 1.21 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని,

ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ పథకాలు ఎంతో ఆర్థిక భరోసానిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ గౌతమ్ కుమార్, ఎంపీడీవో సంధ్య, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.