21-01-2026 12:03:14 AM
ఘట్ కేసర్, జనవరి 20 (విజయక్రాంతి) : జిహెచ్‌ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ 8 లో వేసవి కాలం దృష్ట్య నీటి సరఫరా పెంచాలని, నీటి బిల్లులను తగ్గించాలని కోరుతూ పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి మంగళవారం ఖైరతాబాద్ లోని హెచ్‌ఎండబ్ల్యుఎస్ కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
పోచారం డివిజన్ 8 లో వేసవి కాలం దృష్ట్య నీటి సరఫరా పెంచాలని, బోరు బావుల నీళ్ళు, కృష్ణ నీళ్ళు కలిపి ఇస్తున్నందున బడుగు బలహీన వర్గాల ప్రజలు నివసిస్తున్నువంటి గ్రామాల నీటి బిల్లులను తగ్గించాలని, ఇస్మాయిల్ ఖాన్ గూడ, యంనంపేట్ ప్రాంతాలకు నీటి సరఫరా చేయాలని వినతిపత్రంలో కోరారు.