28 June, 2026 | 2:08 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి

03-11-2025 07:55 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజికవర్గ శాసనసభ్యులు, కూనంనేని సాంబశివరావుకు సోమవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ, గత నాలుగేళ్లగా పెండింగ్ లో ఉన్న రూ.8500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను, విడుదల చేసే విధంగా, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే కూనంనేనినీ కోరారు. ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి కాలేజీలల్లో స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం బాధాకరం అని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియాంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులను కాలేజీ యజమాన్యాలు, సర్టిఫికెట్స్ ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. 

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కనీసం,విద్యార్థుల సమస్యలపై స్పందించే అవకాశం లేదని, మా ఫీజులు మాకు చెల్లించండి అని విద్యార్థులు రోడ్లు ఎక్కుతుంటే రాష్ట్ర  ప్రభుత్వం విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు చేస్తామని బెదిరించటం దుర్మార్గపు చర్య అని అజిత్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఏఐఎస్ఎఫ్ చూస్తూ ఊరుకోదని, తక్షణమే స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలవిడుదల చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్  నాయకులు ఉమ మహేశ్వరరావు కళ్యాణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.