03-11-2025 07:57:56 PM
నకిరేకల్ (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కొరకై సోమవారం హైదరాబాదులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో అధికారులతో, ప్రజాప్రతినిధులతో, మాస్టర్ ప్లాన్ పై రివ్యూ సమావేశం నిర్వహించారు. పలు అభివృద్ధి పనులపై ఆమె సమీక్షించారు. దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.