calender_icon.png 4 November, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ పార్టీలు బీసీలను చిన్న చూపు చూస్తున్నాయి

03-11-2025 07:54:14 PM

బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు 

కామారెడ్డి,(విజయక్రాంతి): రాజకీయ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవిలు అన్నారు. సోమవారం కామారెడ్డి ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో ఈనెల 15 బీసీ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బిసి డిక్లరేషన్ ప్రకటించిందని అందుకు అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు వివరిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ సదస్సులను నిర్వహించనున్నట్లు ఈ సదస్సుల ద్వారా ప్రజలకు వివరించ నున్నట్లు తెలిపారు. కొడంగల్లో ముగింపు సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాదులో బిసి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలను చైతన్య పరచడానికి ఈ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రిజర్వేషన్ సాధన సమితికి ఏ పార్టీతో సంబంధం లేదు

రిజర్వేషన్ సాధన సమితి ఏ పార్టీకి అనుబంధం గా పని చేయడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ సాధన లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఇందులో రాజకీయ పార్టీలకు స్థానం లేదన్నారు. రిజర్వేషన్ల అమలుతో 25 వేల మంది రాజకీయాల్లోకి వస్తారని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ లో పేర్కొందన్నారు. కులగనన కాంగ్రెస్ బీసీ నాయకులు ఒత్తిడి మేరకే చేపట్టిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.

తమిళనాడులో ఏ విధంగా అయితే రిజర్వేషన్ కల్పించారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. కాలేశ్వరం మీద ఆగ మేఘాల మీద అఖిలపక్షం నిర్వహించారని బీసీ రిజర్వేషన్లపై మాత్రం అఖిలపక్షం ఎందుకు నియమించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ ప్రజలకు వివరించి చైతన్యం చేసేందుకే సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.