26-01-2026 09:10:27 PM
స్కాలర్షిప్‌లను అందించిన పేస్ ఐఐటి అండ్ మెడికల్
అమీర్ పేట్,(విజయక్రాంతి): హైదరాబాద్ కేంద్రంగా విద్యారంగంలో విశేష గుర్తింపు పొందిన పేస్ ఐఐటి అండ్ మెడికల్ సంస్థ, జెఈఈ, నీట్, వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడంలో తనదైన ముద్ర వేసిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... నాణ్యమైన బోధన, క్రమశిక్షణతో కూడిన అకాడమిక్ ప్లానింగ్, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ బృందంతో పేస్ విద్యార్థులకు విజయ మార్గాన్ని సుగమం చేస్తోందన్నారు.
ఈ క్రమంలో భాగంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించేందుకు పేస్ ఐఐటి అండ్ మెడికల్ బృందం 50 మంది ఉత్తమ విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్‌లను ప్రకటించిందన్నారు. ఈ స్కాలర్షిప్‌లు జెఈఈ, నీట్ తదితర ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గణనీయమైన ఆర్థిక సహాయంగా నిలవనున్నాయన్నారు. ఈ సందర్భంగా పేస్ హైదరాబాద్ డైరెక్టర్లు హరిత కస్తూరి, చరిత దిట్టకవి (ఫౌండేషన్ బిల్డర్) మాట్లాడుతూ ప్రతిభకు సరైన అవకాశం లభిస్తేనే దేశానికి, సమాజానికి మంచి భవిష్యత్తు సిద్ధమవుతుందన్నారు.
విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి, వారికి సరైన దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించాం అని తెలిపారు. జెఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు పేస్ ఐఐటి అండ్ మెడికల్ సమగ్ర అకాడమిక్ సపోర్ట్, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంలు, రెగ్యులర్ టెస్ట్ సిరీస్, వ్యక్తిగత మెంటారింగ్ ద్వారా ఉత్తమ ఫలితాలు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన వెటరన్ లెఫ్టినెంట్ కల్నల్ కె. విజయ్ శ్యామ్ విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.
కార్యక్రమంలో పేస్ హైదరాబాద్ విశిష్ట అధ్యాపక బృందానికి చెందిన జయసింహా, మురళీధర్, సత్యనారాయణ మూర్తి, సాయి మానస్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా విలువలతో కూడిన విద్యను, పోటీ పరీక్షలకు కావలసిన నైపుణ్యాన్ని, ఫౌండేషన్ స్థాయి నుండి విద్యార్థులకు సులభంగా అందించడంలో పేస్ ఐఐటి అండ్ మెడికల్ ముందంజలో నిలుస్తోంది అని అడిషనల్ డైరెక్టర్ కస్తూరి శంకర్ వివరించారు.