26-01-2026 09:13:19 PM
పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ ఎస్సై గా టి నాగరాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు పాల్వంచ ఎస్సైగా పనిచేసిన సుమన్ ను బదిలీ చేస్తూ ఎస్పి కి అటాచ్మెంట్ చేశారు. మహబూబాబాద్ ఎస్సైగా పనిచేస్తున్న నాగరాజును పాల్వంచ పట్టణ ఎస్ఐ గా నియమించారు. ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు.