calender_icon.png 26 January, 2026 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఉత్తమ సేవల పురస్కారాలు

26-01-2026 09:02:33 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులను సోమవారం ఘనంగా సన్మానించారు. జిల్లా నుంచి అత్యుత్తమ సేవలు అందించిన 9 మంది ఉద్యోగులకు విద్యుత్ శాఖ సిఎండి  కర్నాటి వరుణ్ రెడ్డి  చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగుల పురస్కారాలు అందుకున్నారు. కామా రెడ్డి జిల్లాలోవిశేష సేవలు అందించిన 21 మంది ఉద్యోగులకు  జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.

 గత సంవత్సరం సంభవించిన ఆకస్మిక వరదల సమయంలో అంకితభావంతో విధులు నిర్వహించి విశేష సేవలు అందించిన 230 మంది విద్యుత్ శాఖ ఉద్యోగులకు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్, కామారెడ్డి  రవీందర్  చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్  రవీందర్  మాట్లాడుతూ, అవార్డులు పొందిన ఉద్యోగులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.  భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ విద్యుత్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఉద్యోగులను ప్రోత్సహించారు.