4 May, 2026 | 6:57 PM

పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

10-12-2024 01:33 AM

విద్యార్థులకు తప్పిన ప్రమాదం

మేడ్చల్, డిసెంబర్ 9: మేడ్చల్ మండలం బండమాదారం వద్ద సో మవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం లో 20 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మేడ్చల్‌లోని చాణక్య విజన్ స్కూల్‌కు చెందిన బస్సు 30 మంది స్టూడెంట్స్‌తో బయల్దేరింది.

మధ్యలో గిర్మాపూర్, రాయిలాపూర్ గ్రామాల్లో విద్యార్థులను దింపి బండ మాదారానికి వెళ్తుండగా బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు కండీషన్‌లో లేదని, స్టీరింగ్ తిప్పినా తిరగలేదని డ్రైవర్ సత్యనారాయణ వాపోయారు.