కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ
10-12-2024 01:35 AM
- సభా సంప్రదాయాలు, బిల్లులపై అవగాహన
- రేపు, ఎల్లుండి ఎంసీహెచ్‌ఆర్‌డీలో ట్రైనింగ్
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభలో ప్రవేశపెట్టే బిల్లులు, ప్రసంగించాల్సిన తీరు, శాసనసభ వ్యవహారాలపై ఎమ్మెల్యేలకు సీనియర్ నేతలు, మంత్రులు రెండు రోజుల పాటు (బుధ, గురువారం) ఎంసీహెచ్‌ఆర్‌డీలో శిక్షణ ఇవ్వనున్నారు.
శాసనసభకు మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 50 శాతానికి పైగా ఉన్నారు. ఈ క్రమంలో సభలో ప్రవేశపెట్టే బిల్లులపై స్పష్టత ఇవ్వడం, సభలో మాట్లాడే సమయంలో లోపాలు, తప్పిదాలు జరకుండా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.






