27 April, 2026 | 2:36 AM

చదువుకునే పిల్లలను హాస్టల్లల్లో చేర్పించాలి

27-04-2026 12:53 AM
  1. జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి జి. వినోద్ కుమార్
  2. హాస్టల్  బాట - మీ పిల్లల ప్రగతికి బంగారు బాట

ఘట్ కేసర్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : ఎస్సీ బస్తీలో ఉన్నటువంటి చదువుకునే పిల్లలను హాస్టల్లోనికి పంపించాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి జి. వినోద్ కుమార్ అన్నారు. సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఘట్ కేసర్ లో ఎస్సీ బస్తీలో  చదువుకునే పిల్లలను హాస్టల్లోనికి పంపించాలని హాస్టల్ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. 

కార్యక్రమంలో అధికారి వినోద్ కుమార్ నేరుగా తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారి పిల్లలను హాస్టల్ లో చేర్పించండి మంచి  భవిష్యత్తు ఉంటుందని, విజ్ఞానవంతులుగా చేయడానికి ప్రభుత్వం మంచు సదుపాయాలు కల్పిస్తుందని వారికి వివరించారు. తల్లిదండ్రులు సానుకూలంగా స్పందిస్తూ మా పిల్లలను మీ హాస్టల్లోనికి పంపడానికి మేము సిద్ధంగా ఉన్నా మని తెలియజేస్తున్నాని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి  వినోద్ కుమార్ తో పాటు ఎస్సీ అభివృద్ధి సహాయ అధికారి గోపీచంద్,  హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ధాన్యనాయక్, కాంతిరెడ్డి  మహేష్, లక్ష్మయ్య, కృష్ణ, ఊర్మిళ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.