సెన్సస్ 2027 గృహ గణనలో స్వీయ నమోదు
27-04-2026 12:52 AM
రామచంద్రపురం, ఏప్రిల్ 26: సెన్సస్ 2027లో భాగంగా గృహ గణనకు సంబంధించిన స్వీయ నమోదు ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డిని జాయింట్ డైరెక్టర్ సెన్సస్ తెలంగాణ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కలిసి స్వీయ నమోదు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కుకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, పటాన్చెరు డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, సంగారెడ్డి జిల్లా మాస్టర్ ట్రైనర్ అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు. సెన్సస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు స్వీయ నమోదు విధానం కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు.






