17 April, 2026 | 2:12 PM

Breaking News

కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •  

నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్ల తనిఖీ ఉత్తర్వులు

27-06-2025 12:00 AM

ఎమ్మెల్సీ మల్క కొమురయ్య 

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): టీచర్లతో స్కూళ్ల తనిఖీకి సంబంధించి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధమని, వారితో బడులు తనిఖీలు చేయించడం సరి కాదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య పేర్కొన్నా రు.

పైగా టీచర్లను తీవ్రమైన ఒత్తిడికి, మానసిక సంఘర్షణకు గురి చేసేలా ఉన్న ఆ ఉత్తర్వుల ను పునఃసమీక్షించి రద్దు చేయాలని కోరుతూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్‌ను గురువారం కలిసి వినతిపత్రం అందజే శారు. కేజీబీవీల్లో ఏమైనా పొరపాట్లు జరిగితే టీచర్లను వెంటనే తొలగించకుండా.. నోటీసులిచ్చి విచారణ జరిపేలా చూడాలని కోరారు.

మోడల్ స్కూళ్లలో 317 జీవో అమలులో సమస్యలు తలెత్తకుండా చూడాలని తపస్ ఉపా ధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేష్ విజ్ఞప్తిచేశారు. మోడల్ స్కూళ్లలో క్యాడర్ విభజనకు సంబంధించి విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.