27-06-2025 12:00:00 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణ
చేవెళ్ల, జూన్ 26: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీగలాగే కొద్దీ డొంక కదులుతుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సిట్ అధికారులకు తన వాంగ్మూలం ఇచ్చారు. డీకే అరు ణ ఇంకా సిట్ అధికారులకు ముందు హాజ రుకాలేదు. తాజాగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం ఆయన మొబైల్ నెంబర్‌ను సీడీఆర్ జాబితాలో ఉందని గుర్తించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ పి. వెంకటగిరి గురువారం నోటీసు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ల నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఆయనను శుక్రవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సూచించారు.