17 April, 2026 | 3:43 PM

Breaking News

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •  

తార్నాకలో ‘బడిబాట-2025’

13-06-2025 12:00 AM

ప్రారంభించిన డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి): తార్నాక డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో బడిబాట-2025 కార్యక్రమాన్ని గురువారం నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్‌రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డి తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పుస్తకాలు, యూని ఫాం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపడుతున్న డిజిటల్ తరగతి గదులు, సైన్స్, గణితం, ఇంగ్లీష్ ల్యాబ్స్, వృత్తిపరమైన కోర్సులు (బైండింగ్, ఎలక్ట్రికల్, టైలరింగ్), ఉచిత మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత బస్ పాస్, స్కాలర్‌షిప్స్, ఆరు నుంచి పదో తరగతులకు కంప్యూటర్ తరగతుల వంటి అనేక ప్రోత్సాహక కార్యక్రమాలను వివరించారు.

విద్యా ర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని గొప్ప విజయాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూ టీ ఈవో బాలునాయక్, టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రు లు తదితరులు పాల్గొన్నారు.