23 April, 2026 | 1:22 AM

రేపు పాఠశాలలు బంద్

29-11-2024 02:57 AM

ఫుడ్ పాయిజన్  ఘటనలకు నిరసనగా  ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): రాష్ర్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలకు నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ శనివారం పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. పుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వం స్పందించడంలేదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్.మూర్తి, టి.నాగరాజు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యార్థులు చని పోతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. తక్షణమే సీఎం, విద్యాశాఖ, హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీలపై సమీక్ష చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు.